మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ప్రజ్ఞ పాఠశాలలో పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
జనం న్యూస్ మార్చి 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ కుమార్ అధికారులకు సూచించారు.శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ప్రజ్ఞ పాఠశాలలో పదవ తరగతి పరీక్షా కేంద్రాలను డీఈవో తనిఖీ చేశారు.పరీక్ష సమయం కంటే ముందుగానే కేంద్రానికి చేరుకున్న అశోక్ కుమార్ పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను పరిశీలించారు.పరీక్ష నిర్వహణ తీరు,విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.పరీక్షల నిర్వహణ తీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.