జనం న్యూస్ మార్చి 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన మల్టీ పర్పస్ వర్కర్ షేక్ జానీ పాషా శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం లాలాపురం గ్రామం నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా కూసుమంచి ఫ్లైఓవర్ దగ్గర బైక్ అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయాలు అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు.జానీ మృతితో నారాయణ గూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.