జనం న్యూస్ - మార్చి 29 - నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శీను నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం నాయకులు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లో గిరిజన ప్రజలు అత్యధికంగా నివసిస్తున్నారని గిరిజన చట్టాలను అమలు చేయడంలోనూ గిరిజనులకు రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ వారి సహకారాన్ని అందించాలని కోరారు అనంతరం నూతన సీఐ శీను నాయక్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర శంకర్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమావత్ జవహర్ నాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రామావత్ నరేష్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ నాయక్, జిల్లా సహాయ కార్యదర్శి రాజు నాయక్, నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు లాలూ నాయక్, రమేష్ నాయక్, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ ముని నాయక్, సలహాదారులు రాములు నాయక్, శ్రీను నాయక్, రఘునాయక్, శంకర్ నాయక్, మోహన్ నాయక్, జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.