అర్ధరాత్రి మంచిర్యాల పట్టణంలో పలు ప్రాంతాలను సందర్శించి, ప్రజలతో మాట్లాడిన మంచిర్యాల డీసీపీ
జనం న్యూస్, మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :షబ్-ఎ-ఖద్ర్ - జాగ్ నే కి రాత్ సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా మంచిర్యాల జోన్ డీసీపీ ఏ. భాస్కర్ ఐపియస్., గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించి ముస్లిం సోదరులతో మాట్లాడి ప్రశాంత మైన వాతావరణం లో పండగలను కలిసి జరుపుకోవాలని, ఒకరిని మరొకరు గౌరవించి, మత సామరస్యాన్ని చాటాలని డీసీపీ సూచించారు.అనంతరం మంచిర్యాల రైల్వే స్టేషన్, పట్టణం లోని పలు ప్రాంతాలను సందర్శించి విధి నిర్వాహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి శాంతి భద్రతల సమస్యల తలెత్తడానికి అవకాశం ఉన్న వెంటనే సంభందిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేదిలేదని, అట్టి వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.