జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తూంపల్లి గ్రామంలో సొసైటీ కేంద్రం ద్వారా రైతు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సొసైటీ అధ్యక్షుడు మలవత్ రాములు నాయక్. మరియు సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి. ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ మరియు సొసైటీ డైరెక్టర్లు రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు బకారం రవి మాట్లాడుతూ రైతులు పండించిన పంటను నేరుగా సొసైటీ కేంద్రాలలోనే అమ్ముకోవాలని దళారులకు విక్రయించి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలిపారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా రైతులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలోపాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలరాజు నాయక్. చందరు నాయక్. జీవన్ నాయక్. మల్లేష్. మరియు చుట్టుపక్కల గ్రామాల తండాల ప్రజలు పాల్గొన్నారు.