భద్రాచల రామయ్య కళ్యానానికి తలంబ్రాలు అందజేత
రామకోటి రామరాజు నిశ్వార్థ రామభక్తికి ఘన సన్మానం
మా తలంబ్రాలు భద్రాచలం వెళ్లడం అదృష్టమన్నా భక్తులు
జనం న్యూస్, మార్చి 29, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం చేస్తున్న గత 26సంవత్సరాల నిర్వీరామ ఆధ్యాత్మిక కృషి, పట్టుదలను గుర్తించి భద్రాచల దేవస్థాన గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని ముచ్చటగా మూడో సారి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజుకు 250కిలోల వడ్లను అందించారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రామకోటి రామరాజు గారు గ్రామ, గ్రామాన తిరిగి లక్షల మంది భక్తులచే గోటి తలంబ్రాలు ఓలిపిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం నాడు శిశుమందిర్ స్కూల్ లో కోటి తలంబ్రాల దీక్ష నిర్వహించారు. భక్తులు పాల్గొని రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఓలిచి రామకోటి రామరాజు,కి అక్కడే అందజేసి రామభక్తిని చాటుకున్నారు.అనంతరం విశ్వహిందూ పరిషత్ మెదక్ జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ రామకోటి రామరాజు,ను ఘనంగా సన్మానించి మాట్లాడుతూ గత 2సంవత్సరాల నుండి రామాయంపేట్ నుండి భద్రాచల రామయ్య కల్యానానికి గోటి తలంబ్రాలను తీసుకెళ్తున్న రామకోటి రామరాజు నిస్వార్థ రామభక్తి అమోఘం అన్నారు. లక్షల మంది భక్తులను భాగస్వామ్యం చేయడం కృషి, పట్టుదల అమోఘం అన్నారు. ఈ కార్యక్రమంలో మాతృశక్తి అధ్యక్షురాలు అనంతలక్ష్మి, రవేందర్, చంద్రకళ, వనజ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.