జనం న్యూస్ మార్చి 28 నడిగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చౌకధరల దుకాణాల ద్వారా నిరుపేదలకు తెలుగు సంవత్సరాది ఆరంభంలో ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులు మిల్లర్లు డీలర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. దీంతో నడిగూడెం మండలంలో గ్రామాల్లో చౌక ధరల దుకాణాలకు ఎంఎల్ ఎస్ పాయింట్ నుంచి సన్న బియ్యం రవాణా చేసింది.రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఉగాది పండగ నుంచి లబ్ధిదారులకు అందనున్నాయి. ప్రభుత్వం దొడ్డు బియ్యం సరఫరా చేయడంతో చాలామంది ఆ బియ్యాన్ని తినలేక ఇతరులకు విక్రయించేవారు. వ్యాపారులు ఆ బియ్యాన్ని కిలోకు రూ. 4 నుంచి రూ. 10 వరకు కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకు టన్నులకొద్దీ అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకునే వారు. సన్న బియ్యం సరఫరా చేస్తుండడంతో అక్రమ రవాణాకు కళ్ళెం పడనుంది.