జనం న్యూస్ మార్చి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి రేషన్ డీలర్లతో తహసిల్దార్ మాట్లాడుతూ ఏ ఒక్కరు బియ్యం అమ్మి నట్లు ఫిర్యాదులు వస్తే కేసులు పెడతామని తహసిల్దార్ కాల్వల సత్యనారాయణ హెచ్చరించారు వచ్చే నెల నుంచి రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం సరఫరా చేస్తుందని డీలర్ల మార్చి నెలకు సంబంధించిన దొడ్డు బియ్యం నిల్వలు ఉంటే పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చేవరకు భద్రపరచాలని తెలిపారు రేషన్ కార్డుదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ దొడ్డు బియ్యం ఇవ్వొద్దని వారికి సన్న బియ్యం మాత్రమే ఇవ్వాలని తెలియజేశారు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు రేషన్ షాపులు తెరవాలని ఆదేశించారు ఈ సమావేశంలో డీలర్లు కాంబత్తుల ప్రకాష్ కుసుమ మల్లయ్య బాబురావు తదితరులు పాల్గొన్నారు….