▪️జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి..
జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ (జమ్మికుంట)..
భారతదేశమంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని దేశంలోని విభిన్న కులాల మతలవారు ఉగాది, రంజాన్ మరియు రాబోయే పండుగలను అన్ని కులాల మతల వారు స్నేహపూర్వమైన వాతావరణంలో, పండుగలను జరుపుకోవాలని జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి విలేకరుల సమావేశంలో తెలిపారు. శుక్రవారం రోజున జమ్మికుంట పోలీస్ స్టేషన్లో జరిగిన కమిటీ సమావేశంలో జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి మాట్లాడుతూ… పండుగలను ప్రజలంతా కలిసి శాంతియుతంగా జరుపుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. గతంలో మాదిరిగానే కులమతాల బేధం లేకుండా పండగలు జరుపుకోవాలని పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. పండుగల సమయంలో ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండే విధంగా పోలీస్ పహార ఉంటుందని ప్రజలకు పోలీస్ సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవితోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.