▪️దేశీని కోటి ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్..
జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఇల్లందకుంట దేవస్థానం చైర్మన్ దేశిని కోటి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.
ముస్లింలకు పరమ పవిత్రమైన రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కఠిన ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులో భాగంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గల మసీదులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేశిని కోటి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందును స్వీకరించారు. హిందూ ముస్లిం తేడా లేకుండా మతసామరస్యాన్ని చాటుతూ ఒకరి పండుగలకు ఒకరు హాజరవుతూ మనమంతా ఒక్కటే అన్న భావంతో పండుగలు జరుపుకోవడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ముస్లిం పెద్దలు కొత్తపల్లి పుర ప్రముఖులు పాల్గొన్నారు.