జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి కార్యాలయం నందు ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం అన్న స్వర్గీయ ఎన్టీఆర్ గాచేతుల మీదుగా పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఆరు మండలాల్లో పసుపు జెండా ఎగరేస్తాం. యువనాయకులు నారా లోకేష్ సారథ్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా ముందడుగు వేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ
43 ఏళ్ల సుదీర్ఘ ప్రజా ప్రస్థానంలో ప్రతి క్షణం పసుపు జెండాను భుజానకెత్తుకుని సగర్వంగా ముందడుగు వేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
రాజంపేట పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద ఉన్న మేడా విజయ శేఖర్ రెడ్డి టీడీపీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు తదనంతరం జండా వందనం చేసి కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెదేపా నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తులో పాల్గొని జయప్రదం చేశారు. తదనంతరం మేడా విజయ శేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వర్ధిల్లాలని జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అని నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలని అలాగే మన భావితరాల ముఖ్యమంత్రి నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలని పెద్ద ఎత్తున నినందించారు.సరిగ్గా 43 ఏళ్ల కిందట.సమాజమే దేవాలయం.ప్రజలే దేవుళ్లు అంటూ. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం అన్న స్వర్గీయ ఎన్టీఆర్ చేతుల మీదుగా పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ ఎన్నో ఉత్థాన పతనాల నుంచి పడిలేచిన కెరటంలా ఎగసిపడుతూ దార్శనిక నాయకులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బడుగు, బలహీన వర్గాల పార్టీగా, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా రూపందుకుందని.తెలుగు జాతి కీర్తిని దశదిశలా చాటు కుంటూ.యువనాయకులు నారా లోకేష్ సారథ్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా ముందడుగు వేస్తున్న సందర్భంగా ఈ 43 ఏళ్ల సుదీర్ఘ ప్రజా ప్రస్థానంలో ప్రతి క్షణం పసుపు జెండాను భుజానకెత్తుకుని సగర్వంగా ముందడుగు వేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు .ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని తమ ఇంటి పార్టీగా గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్న తెలుగు ప్రజలందరికీ..హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు. రాబోయే రోజుల్లో రాజంపేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యెద్దల విజయ సాగర్, నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ మేజర్ సర్పంచ్ జంబు సూర్యనారాయణ,లేభాక సర్పంచ్ నరసయ్య,నందలూరు మండల మాజీ ఎంపీపీ భువన బోయిన లక్ష్మీ నరసయ్య, రాజంపేట పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు రాము యాదవ్,టంగుటూరు ఎంపీటీసీ పెంచలయ్య,రాజంపేట తెలుగు యువత అసెంబ్లీ అధ్యక్షుడు చిన్నేపల్లి హరీష్,ధనుంజయ నాయుడు,ఆడపూరు బాబు, ఎల్లమ్మరాజు పల్లి శ్రీనివాసులు రెడ్డి,సుబ్బారెడ్డి,మండెం నాగరాజు,నీటి సంఘం అధ్యక్షుడు చుక్కా కొండయ్య, ఎంపీ రావు,సుబ్రమణ్యం, టంగుటూరు కృష్ణమూర్తి గుజ్జల ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు