జనం న్యూస్ జనవరి 14 నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం దామరాగిద్ద మండల పరిధిలోని ముస్తాపేట గ్రామంలో మంగళవారం రోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎస్ ఎఫ్ ఐ, డి వై ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు యువత కు కబడ్డీ పోటీలు నిర్వహించారు.ఈ సందర్బంగా వివిధ పార్టీ నాయకులు పాల్గోని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామంలో క్రీడాలు నిర్వహించడం మంచి సంప్రదాయం అని విద్యార్థి యువజన సంఘం నాయకులను అభినందించారు. భవిష్యత్ లో యువత మన గ్రామ ప్రతిష్ట ను జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమం లో డి వై ఎఫ్ ఐ నాయకులు మాజీ సర్పంచ .లాలప్ప,రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్,మాజీ సర్పంచ.రంగయ్య గౌడ్,వివిధ పార్టీల నాయకులు నర్సిములు గౌడ్,భీంసేన్ గౌడ్,నరేందర్ గౌడ్, మల్లప్ప,రోషలప్ప,రాములు,కేశవర్ధన్ కిందింటి శీను తదితరులు పాల్గొన్నారు.