జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం అందోల్ జోగిపేట్ మున్సిపల్ సంగారెడ్డి జిల్లా 31-3-2025 సోమవారం బి ఆర్ ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదినాన్ని పునస్కరించుకొని, రంజాన్ కిట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రంజాన్ అనేది ఒక మాసం పేరు, ఈ మాసంలో ముస్లిం సోదరులంతా అతి పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు. రంజాన్ ని " ఈద్ ఉల్ఫీత్ " అని కూడా అంటారు. పండుగ అనేది ఏ మతానికి, కులానికి సంబంధించినది అయినా కావచ్చు. దాని వెనక అద్భుతమైన సందేశం ఉంటుంది, అలాగే రంజాన్ పండుగ వెనుక కూడా మానవాళికి మంచి చేసే ఉద్దేశం ఉంది. ఇది క్రమశిక్షణ, ద్రాతృత్వాన్ని , ధార్మిక చింతనను, ప్రజలకు బోధిస్తుంది. ముస్లిం మత గంధమైన "ఖురాన్ " ఈ మాసంలోనే ఆవిర్భవించిందని చెప్పుకుంటారని, అందుకే ఈ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసంగా పేర్కొన్నారు.