జనం న్యూస్- మార్చి 31- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా పైలాన్ కాలనీ ఈద్గా వద్దకు వెళ్లి మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ కౌన్సిలర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు హీరేకర్ రమేష్ జి, సల్లోజు శేఖరాచారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజులు ఉపవాసం ఉండి అతి పవిత్రంగా జరుపుకునే పండుగ రంజాన్ అని, బిఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ సోదరులకు చేదోడు వాదోడుగా ఉండేదని గుర్తు చేశారు, మైనార్టీ సోదరులు అందరికీ టిఆర్ఎస్ పార్టీ తరపున రంజాన్ ,ఈద్ ముబారక్ తెలిపారు, అందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో హిల్ కాలని పైలాన్ కాలనీ మౌజాన్లు మసీదు పెద్దలు గౌస్ బాయ్ ,అలీ భాయ్, రషీద్, మక్సుద్, నజీర్, జహంగీర్, రజాక్, అలీ బాబా, హబీబ్, హాజీ, ఖాజా, జానీ, జిలాని, రియాజ్, నజీర్, మహబూబ్, యూసుఫ్, పఠాన్, సలీం, అహ్మద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.