జనం న్యూస్ మార్చి 31:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలంలోనిబట్టాపూర్ గిరిజన తండాలో తాండవాసులు, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మాలదారులు సేవలల్ మహారాజ్ శోబయాత్రను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ.. తమ ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మాల వేసుకుని నలభై ఒక్క రోజులు భక్తిశ్రద్ధలతో జగదాంబ మాతను, సేవాలాల్ మహారాజును పూజించడం, భోగ్ బండారు నిర్వహించడంతో పాటు సేవాలాల్ మహారాజ్ శోబయాత్రను డప్పు వాయిద్యలతో గ్రామంలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భూక్య శ్రీనివాస్, భూక్య శివ, భూక్య హరి సింగ్, మాలవత్ రాజేష్ నాయక్, సతీష్ నాయక్,నితిన్ నాయక్, జీవన్ నాయక్,అనిల్ నాయక్,దేవేందర్ నాయక్, మాలవతు రవి నాయక్, భుక్య తిరుపతి నాయక్, తాండవాసులు, తదితరులు, పాల్గొన్నారు.