జనం న్యూస్ ఏప్రిల్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆహార భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు శాయంపేట మండల కేంద్రంలోని గల రేషన్ డీలర్ షాప్ నెంబర్ 19 సింగరకొండ రమేష్ గుప్తాకు చెందిన రేషన్ షాపులో ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని సోమవారం రోజున ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించి పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర లో ఈ సంవత్సరం ఉగాది పండుగ చరిత్ర పుటల్లో లిఖించదగ్గ రోజుగా నిలుస్తుందన్నారు దేశంలో నే తొలిసారిగా పేద ప్రజలకు ఆహార భద్రతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక ఘట్టూనికి శ్రీకారం చుట్టారని తెలిపారు దారిద్రరేఖలకు దిగువన ఉన్న పేదలతో పాటు మధ్య తరగతి ప్రజలకు ఆహార భద్రత కల్పించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కలలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది అని తెలిపారు సన్న బియ్యం పథకం కింద రాష్ట్ర జనాభాలో సుమారు 80 శాతం ప్రజలకు ఉచితంగా లబ్ధి చేకూరుతుందన్నారు దొడ్డు బియ్యం తినేందుకు ప్రజలు చాలా ఇబ్బందుల్లో పడ్డారు అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్ పద్మశాలి మండల అధ్యక్షులు సామల మధుసూదన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డీలర్లు తదితరులు పాల్గొన్నారు…..