యూట్యూబ్ ద్వారా అనేకమంది తమ ప్రతిభను కనబరుస్తున్నారు....
యువ సింగర్ ఇంద్ర కుమార్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి...
జనం న్యూస్ జనవరి 15 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సమాజాన్ని చైతన్యం పరచడంలో పాటలు ద్రోహదపడతాయని, అనేకమంది యువత యూట్యూబ్ ద్వారా తమ ప్రతిభను కనబరిచారని సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ అన్నారు. యూట్యూబ్ పాటల గాయకుడు రచయిత కొమరబండ గ్రామానికి చెందిన దేవపంగు ఇంద్ర కుమార్ స్వయంగా రచించి పాడిన లింగమంతుల స్వామి గొల్ల గట్టు జాతర పాటల సిడిని మంగళవారం కోదాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇంద్రకుమార్ గత కొంతకాలంగా అనేక పాటలను పాడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. ఎప్పుడు ఎవరో అవకాశం ఇస్తారని ఎదురు చూసుకోకుండా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తన ప్రతిభను కనబరిచి అనేకమంది యువతకు స్ఫూర్తిగా నిలిచారని నేటి యువత ఇంద్ర కూమార్ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. వారు పాడిన లింగమంతుల స్వామి గొల్ల గట్టు జాతర పాటలు ప్రజల ఆదరణ పొందాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు పడిశాల రఘు , గూగులోతు సురేష్, పుట్టా వెంకటేష్, నేలమర్రి శ్రీకాంత్, సాయి, కృపారావు, గణేష్, గోపి, తదితరులు పాల్గొన్నారు