జనం న్యూస్ ఏప్రిల్ 1 నడిగూడెం
మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన సంఘం రమేష్ కిరాణం షాపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఆదివారం రాత్రి పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ. 4 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు సంగం రమేశ్ వాపోయాడు. రెండు ఫ్రిజ్లు, కుర్చీలు, రెండు మంచాలు, కిరాణా సరుకులు పూర్తిగా కాలిపోయి నష్టపోయినట్లు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.