జనం న్యూస్ ఏప్రిల్ ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి
అమలాపురం :డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ ని కోనసీమ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కలిసి విజ్ఞప్తిని చేశారు. యానాం నుండి అక్రమంగా వస్తున్న డీజిల్ ఆయిల్ వలన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి రావలసిన టాక్స్ కొన్ని కోట్ల రూపాయలు నష్టం గూర్చి వివరించారు.కోనసీమ జిల్లాలో ఉన్న కన్స్యూమర్ బంక్ ల పేరుతో అక్రమ ఆయిల్ అమ్మకాలు గూర్చికేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కి పిర్యాదు చేయుట కొరకు అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోనసీమ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ సభ్యులు కుసుమ అనీల్ కుమార్, సునీల్ కుమార్, తాతబాబు, సుధీర్ రాజు, సురేష్, విశ్వేశ్వరావు, రత్నాకర్, చిట్టిబాబు, శరత్ తదితరులు పాల్గొన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.