జనం న్యూస్ జనవరి 14 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామపంచాయతీ పారిశుధ్యం పడకేసింది పంచాయతీ కార్యదర్శి నిర్వహణ సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామాల్లోని తడి పొడి చెత్తను తరలించడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీ ఓ ట్రాక్టర్ ఇచ్చారు నేలల్లో రెండు రోజుల కుడా గ్రామంలో చెత్తను తరలించడానికి ట్రాక్టర్ వాడటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామంలో మురికి కాలువ నుండి తీసిన మట్టి .బురుద. పాత్రలు. తుక్కు ఇండ్ల ముందు గత నాలుగు రోజులుగా అలాగే ఉండటం తో ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇండ్ల ముందు ముగ్గులు వేయడానికి కూడా విలు లేకుండా పోయిందని గ్రామస్థులు తెలిపారు మురికి కాలువ శుభ్రం చేసి రోడ్డు పై ఇండ్ల ముందు పోసిన మట్టి నాలుగు రోజులుగా అలాగే ఉండటం ఈగలు దోమలు వాలి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేల రూపాయలు ఖర్చు చేసి ట్రాక్టర్లు ను కొనుగోలు చేసి వాటిని ఉపయోగించి చెత్తను తరలించడానికి ట్రాక్టర్ లను ఇస్తే వాటిని నేలల్లో నాలుగు రోజులు కుడా నడిపి చెత్తను తరలించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు దీనికీ పూర్తిగా పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ప్రధాన కారణమంటున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమాస్యలు పునరావృతం కాకుండా వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలని. నిర్లక్ష్యం వహిస్తున్న కార్యదర్శి పై చర్యలు చేపట్టాలని గ్రామస్తులు అధికారుల ను కోరుతున్నారు