జనం న్యూస్ ఏప్రిల్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి కొత్తూరు లో ఉన్న డంపింగ్ యార్డ్ ని శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పరిశీలించి
చుట్టూ ప్రభుత్వ భూమి ఎంత ఉందొ సర్వే చెయ్యమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎనిమిదిన్నర ఎకరాలలో ఉన్న డంపింగ్ యార్డ్ ఆనుకుని ఉన్న స్థలం లో చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు, ప్లే గ్రౌండ్ కి ప్రభుత్వ స్కూల్ కి ఎకరం స్థలం కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. చెరువును పరిశీలించి చెరువు విస్తీరణం ఎంత ఉందొ కొలవమన్నారు . ఆక్రమణలను గుర్తించి రిపోర్ట్ తాయారు చేయాల్సింది గా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ని కోరారు. చెరువు చుట్టూ లైట్స్ ఏర్పాటు చేసి పోలీస్ గస్తీ ఏర్పాటు చెయ్యాలని సుచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ అయేషా కలెక్టర్ విజయ్ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.