జనం న్యూస్ ఏప్రిల్ 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణం ఇందిరా మార్కెట్ లో గల రేషన్ షాప్ లో మంగళవారం లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్, జేసీ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్ల ప్రారంభించారు. ముందుగా కొబ్బరికాయలు కొట్టి, రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులకు సన్న రేషన్ బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తారు. సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు మరింత లాభం చేకూరనుందని అన్నారు. ప్రతీ లబ్దిదారుడు సన్న బియ్యాన్ని ఇంట్లో వండుకోవాలని, దాళారులకు అమ్మకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ ఎమ్మార్వో కిరణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు సీడం గణపతి, షబ్బీర్, శరత్ ముదిరాజ్, రేషన్ షాపు డీలర్లు ఉమేష్ బంగ్, లడ్డు బాబు, తూడూరు విజయ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.