బిచ్కుంద ఏప్రిల్ 1:-( జనం న్యూస్) ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలో మంగళవారం రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పట్లోళ్ల రామకృష్ణారెడ్డి( భీమ్ పటేల్), కాంగ్రెస్ నాయకుల తో కలిసి ప్రారంభించారు. రేషన్ డీలర్ తో కలిసి లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించినందుకు లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు