జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని ఆజాది యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన నిరసనకి సంఘీభావంగా హుజురాబాద్ నియోజకవర్గం హుజూరాబాద్ లో శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీసీలకు రిజర్వేషన్ నిరాహార దీక్షలో ఆకినపల్లి శిరీష పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..స్వాతంత్రం వచ్చిన ఈ 70 సంవత్సరాలలో బీసీలను కేవలం ఓటు వేయడానికి మాత్రమే ఈ రాజకీయ నాయకులు వాడుకుంటూ రిజర్వేషన్ అమలు చేస్తామని ఓట్ల పబ్బం గడుపుకునే నాయకులు అని అన్నారు. ఇకనైనా మారి దేశంలో అత్యధికంగా ఉన్న బీసీలకు కచ్చితంగా 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆకినపల్లి శిరీష డిమాండ్ చేశారు.