జనం న్యూస్ 14 జనవరి 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మహమ్మద్ న్యూస్ ప్రతినిధి)
హెల్పింగ్ హాండ్స్ మిత్రబృందం సేవలు మరువలేనివని అంభం గ్రామస్తులు కొనియాడుతున్నారు.
రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో మంగళవారం హెల్పింగ్ హాండ్స్ మిత్ర బృందం ఆధ్వర్యంలో కుర్మ పార్వతి అంత్యక్రియల కొరకు 5 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ మిత్ర బృందం సభ్యులు కుర్లెపు గంగాధర్, గొల్ల స్వామి, ఇందూర్ గంగాధర్, వడ్ల సాయి బాబా, గంగా ప్రసాద్, పున్న లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.