జనం న్యూస్/జనవరి 14/కొల్లాపూర్
వీపనగండ్ల మండలం సంగినేనిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మనరసింహా గుట్ట దగ్గర చెంచులక్ష్మీ ఆధిలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి మకర సంక్రాంతి పండగ సందర్బంగా ఉత్సవాల్లో పాల్గొన కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మినరసింహా స్వామి ని దర్శించుకుంటారు. గతంలో మన హయాంలోనే శ్రీ లక్ష్మీనరసింహా స్వామి గుట్టకు బిటి రోడ్డు పనులు ప్రారబించి రోడ్డు వేయించి భక్తులకు ఇబ్బంది లేకుండా చూశాం అన్ని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ని శాలవతో సన్మానించడం జరిగింది._ ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.