జనం న్యూస్ 02 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లపై ఆధానితో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న సేకి ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ మంగళవారం ఎల్.బి.జి నగర్లో ఇంటింటికీ స్టిక్కర్లు అతికించారు. ప్రజలపై భారాలు వేసే ట్రూ ఆఫ్ చార్జీలను రద్దు చేసి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.