వాతావరణ మార్పులకు,అధిక ఉష్ణోగ్రతలు పెరగడానికి అడవులు రోజురోజుకు తగ్గిపోవడమే ప్రధాన కారణం
అడవులను వన్యప్రాణులను కాపాడుకున్నప్పుడే మనుషులు సంతోషంగా జీవించగలరు
ఎఫ్ఆర్ఓ ఆదిత్య
జనం న్యూస్ ఏప్రిల్ 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
మునగాల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో పర్యావరణ మార్పులు పరిణామాలు" అనే అంశంపై పాఠశాల యూత్ అండ్ ఎకోక్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది, పాఠశాల ప్రిన్సిపల్ బూర సైదయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోదాడ ఎఫ్ఆర్ఓ ఆదిత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పులకు,అధిక ఉష్ణోగ్రతలు పెరగడానికి అడవులు రోజురోజుకు తగ్గిపోవడమే ప్రధాన కారణం అన్నారు.అడవులను వన్యప్రాణులను కాపాడుకున్నప్పుడే మనుషులు సంతోషంగా వించగలుగుతారన్నారు. ఈ ప్రయత్నంలో అధ్యాపకులు విద్యార్థులు భాగస్వాములై ప్రజల్లో అవగాహన,చైతన్యం కలిగించాలన్నారు. మోడల్ స్కూల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించడంలో, మొక్కలు నాటడంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వారికి అవగాహన కలిగించడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించి తమను శాఖా పరంగా భాగస్వాములు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్పందిస్తూ తాము పాఠశాలలో ఇకనుండి ప్లాస్టిక్ వినియోగం చేయమని, ప్రతి పుట్టినరోజుకు మొక్కలు నాటుతామని తద్వారా పర్యావరణాన్ని, వన్యప్రాణులను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు ఓరుగంటి రవి, ఎస్ రాధాకృష్ణ, సేంద్రీయ వ్యవసాయ ప్రచారకులు ములుగునూరు గోపి, పాఠశాల అధ్యాపకులు ఎన్ రామలింగ చారి, షేక్ షరీఫ్, ఇతర ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.