జనం న్యూస్. ఏప్రిల్ 3. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
హత్నూర మండలంలోని నవాబుపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 25వ. వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాలు గురువారంనాడు అంగరంగ వైభవంగా కొనసాగాయి.మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా గురువారం రెండవ రోజున కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించారు.అధిక సంఖ్యలో హాజరైన భక్తులు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం భగవద్గీత పఠనం, హోమాలు నిర్వహించి. పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.హత్నూర మండలంలోని వివిధ గ్రామస్తులతో పాటు, కామారెడ్డి మహబూబ్ నగర్, షాద్నగర్, వికారాబాద్, తాండూరు తదితర జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో. నవాబుపేట గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.