ప్రతి ఏటా జన్మదిన వేడుకలు అనాధ ఆశ్రమంలోనే జరుపుకుంటున్న మంత్రి సవితమ్మ
అనాధ ఆశ్రమo లోని విద్యార్థులు సంక్షేమం కోసం 2,00116 చెక్కును ఆశ్రమ నిర్వాహకులకు అందజేసిన మంత్రి సవితమ్మ
జనం న్యూస్ జనవరి 15 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం
హిందూపురం లోని శ్రీ సత్యసాయి సేవా సదన్ అనాధాశ్రమంలోని విద్యార్థులు మధ్య కేక్ కట్ చేసి తన జన్మదిన వేడుకలు జరుపుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రిసవితమ్మ అనంతరం విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటుచేసి ,యూనిఫామ్ అంద చేసిన సవితమ్మ మీకుఅన్నివిధాలుగా అండగా ఉంటానని కష్టపడి బాగా చదువు కొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకుతెలియచేసిన సవితమ్మఈసందర్భంగామంత్రిసవితమాట్లాడుతూ సత్యసాయి బాబా చూపించిన ఆధ్యాత్మిక, సేవా మార్గం మనందరికీ ఆచరణీయం.ప్రతి ఏటా నా జన్మదిన సందర్భంగా ఆశ్రమంలోని అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు సత్యసాయిబాబా యొక్క ఆశీస్సులు ఉండాలని అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి అల్పాహారం తీసుకున్నారు. ఆశ్రమ అభివృద్ధికై నిర్వాహకులకు 2,00,116 రూపాయలు చెక్కును అందజేసిన మంత్రి సవితమ్మ . ఈ కార్యక్రమంలో పలువు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు..