బిచ్కుంద ఏప్రిల్ 5 జనం న్యూస్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శనివారం రోజు బిచ్కుంద మండలం బండరెంజల్ గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సన్న బియ్యం పంపిణీ ఒక చారిత్రాత్మక విప్లవం అన్నారు.దేశ వ్యాప్తంగా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ప్రతి నెల ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడం వల్ల ప్రజలు ఎవరూ వాటిని తినకపోగా.. దళారులకు అమ్ముకోవడంతో పథకం పక్క దారి పట్టి ప్రభుత్వానికి నష్టం వాటిల్లేదని అని అన్నారు.ఇప్పుడు ప్రజా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల పేదల కడుపు నింపడమే గాక.. ఒక్కో కుటుంబానికి రూ. 1500 వరకు ఆదా అవుతుందని చెప్పారు. అనంతరం బండరెంజల్ గ్రామంలో సి.సి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, డెలికేట్ విట్టల్ రెడ్డి, పుల్కల్ మాజీ సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, గోపాల్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ సాయిని అశోక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు