జనం న్యూస్ జనవరి 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ... అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం వడ్డాది గ్రామం ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న విద్యార్థులంతా సంక్రాంతి సందర్భంగా దేశ విదేశాలలో స్థిరపడినటువంటి విద్యార్థులందరూ అదే గ్రామంలో వారు స్కూల్ సమయంలో ఆడుకున్న గ్రౌండ్లోనే కలిసి చాలా ఆహ్లాదంగా గడిపారు. చిన్నప్పుడు వారు చేసిన అల్లరి ఆట పాటలతో వారంతా కలిసి చాలా సంతోషంగా గడిపారు. ముఖ్యంగా క్రికెట్ ఆటలో ఒకరికొకరు పోటీతో పరుగులు తీస్తూ గతంలో ఆడిన ఆటను మైమరిచేలా ఆడారు.. వీరంతా బాల్యంలో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ చాలా ఆనందంగా ఒకరినొకరు పలకరించుకుంటూ కేరింతలతో గడిపారు.//