జనం న్యూస్ ఏప్రిల్ 05
నడిగూడెం మండల కేంద్రానికి చెందిన దేవరంగుల ఎల్లయ్య మృతి బాధాకరమని తెలంగాణ ఉద్యమకారుడు బడుగుల వెంకటేష్ అన్నారు. బుధవారం మృతుడి నివాసంలో జరిగిన దశదినకర్మలో పాల్గొని మాట్లాడారు. మృతుడి చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బోనగిరి ఉపేందర్, నాయకులు జలీల్, మహమ్మద్ రఫీ, లింగరాజు పాల్గొన్నారు.