జనం న్యూస్ జనవరి 15 కాట్రేని కొన.... సంక్రాంతి సందర్భంగా పొలమూరుపాడు తన స్వగ్రృహానికి విచ్చేసిన డాక్టర్ ఎన్ ప్రకాష్ రావు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార ప్రసార శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి వారి ఓఎస్డీ ని మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామ యువత. నేడు సంక్రాంతి సందర్భంగా తన అమ్మమ్మ తాతయ్య ల వారి జ్ఞాపకార్థం ప్రతీ సంవత్సరం తన స్వగ్రామం లో ప్రజలకు అన్న, వస్ర్తాలు సమర్పించుకునే సాంప్రదాయాన్ని కొనసాగించు కునేందుకు వచ్చిన డాక్టర్ నాతి ప్రకాష్ రావు గారిని కలిసిన తన గ్రామం అంతా ఆనందోత్సాహాలతో మునిగి తేలి యాడారు ,ఈ సందర్భంగా చదువుకునే యువత ఎదో ఒక రంగంలో స్థిరపడాలని, తల్లితండ్రులు కు బారం కాకుండా వృద్దాప్యం లో వారు కష్టపడి చదివించిన కష్టాన్ని మరిచిపోయే లా వారు జీవించే లా మనం స్థిరపడాలని తెలిపారు.. కలిసిన వారిలో బిజెపి జాతీయ మండలి సభ్యులు రొక్కాల సత్తిబాబు,పొలుగుమాటి వరప్రసాద్ బాబు,పంతగడ జానకి రామయ్య,మడికి వెంకట్రావు, (ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తాళ్ళు రేవు) జనిపల్లి శ్రీనివాస్,బత్తుల ధర్మరావు,పొలుగుమాటి శ్రీకాంత్.తదితరులు ఉన్నారు.