జనం న్యూస్ 7-4-2025 అందోల్ నియోజకవర్గం-జిల్లా
సంగారెడ్డి అందోల్-జోగిపేట మున్సిపాలిటీ 12వ వార్డు శ్రీ రాజరాజేశ్వర దేవాలయం పక్కన నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామికి శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో ఘనంగా నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి గారికి ఆలయ అర్చ కులు ప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో, మంత్రో చరణాల నడుమ ఆయనకు సత్కారం జరిపారు. ఆలయ పరిసరాల ప్రాంతంలో భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలన్నారు. రాముని ధర్మ పరాయణత, నిజాయితీ, ప్రజల పట్ల ప్రేమ భక్తులు జీవితంలో అనుసరించాల్సిన అంశాలన్నారు. ఇలాంటి మహనీయుని కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలం అన్నారు. సీతారాముల కల్యాణం కార్యక్రమం వైభవంగా సాగింది. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. రామానుజాచార్యుల సాంప్రదాయం ప్రకారం, వేద మంత్రాల నడుమ సీతారాముల కల్యాణం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను వీక్షించారు.భక్తులు ఆనందంగా, శ్రద్ధగా కళ్యాణం తిలకించి ఆధ్యాత్మికతను ఆస్వాదించారు. కళ్యాణానంతరం పూజలు, తీర్థ ప్రసాదాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ, క్యూలైన్ ఏర్పాట్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణోత్సవం భక్తులు తరలివచ్చేలా చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయంగా నిలిచాయి. రాష్ట్ర మంత్రి హాజరైన నేపథ్యంలో ఈ వేడుకకు మరింత పటిష్టత, మహాత్మ్యం చేకూరింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.