జనం న్యూస్ ఏప్రిల్ 7 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
కాట్రేనికోన మండలం చింతల మెరక గ్రామం లో శ్రీరామనవమి సందర్భంగా "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము"ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుబ్బల శ్రీ కాంత్ ,నివేదిత, లావేటి సత్య నారాయణ, సత్య గౌరి దంపతులు చే కళ్యాణం నిర్వహించబడినది శుభ సందర్భంగా…వేదపండితులు ఆకొండి మహేష్ శర్మ ,శ్రీకాంత్ శర్మ ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు. శ్రీరామ ప్రవర:- చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే… అజ మహారాజ వర్మణః పౌత్రాయ… దశరథ మహారాజ వర్మణః పుత్రాయ…
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ. సీతాదేవి ప్రవర:- చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం జనక మహారాజ వర్మణః పుత్రీం సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది… ఈ కార్యక్రమం అనంతరం అన్న సంబరాధన పానకం పంపిణీ చేశారు గ్రామ ప్రజలు.