జనం న్యూస్ 07 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ )
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి గ్రామంలో ఆదివారం శ్రీరామ నవమి పర్వదినంని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వీరభద్ర స్వామి దేవాలయం నుండి హనుమాన్ టెంపుల్ వరకు స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లడం జరిగింది. హనుమాన్ దేవాలయంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.