జనం న్యూస్ ఏప్రిల్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజమణి దంపతులు స్వామి వారికి మంగళ సూత్రాలను తలంబ్రాలు పట్టు వస్త్రాలను మంగళ వాయిద్యాల మధ్య తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు అనంతరం దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి గణపతి పూజ విశ్వక్సేన ఆరాధన రక్షాబంధన పూజ పుణ్యా వచనం నిర్వహించి వేదమంత్రాల మధ్య సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించినారు అడ్వకేట్ లెక్కల జలంధర్ రెడ్డి లక్ష్మీ దంపతులు ఈ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు ఈ ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రొఫెసర్ చిలకమూరి సంజీవ సీతారాముల కళ్యాణం గురించి వాక్యానం చేసినారు ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ చిందం రవి బాసని మార్కండేయ గిద్దమారి సురేష్ వనం దేవరాజు ఉప్పు రాజు బత్తుల రాజేష్ కడారి చంద్రమౌళి బాసాని నవీన్ వినుకొండ శంకరాచారి డి సుమన్ నాగరాజు శివాజీ తిరుపతి వికాస్ సందీప్ సురేష్ నిరంజన్ రాజేష్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….