ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్
జనం న్యూస్ 14 జనవరి కొత్తగూడెం నియోజకవర్గం... స్థానిక పాల్వంచ పట్టణంలో ఎస్ఎఫ్ఐ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ భద్రాద్రికొత్తగూడెం జిల్లా 4వ మహాసభలు పాల్వంచ పట్టణంలో ఫిబ్రవరి 5,6 తేదీలలో నిర్వహించనునట్లు తెలిపారు. జిల్లాలో అన్ని మండలాల నుండి ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఈ మహాసభలకు హాజరవుతారన్నారు. ఎస్ఎఫ్ఐ భవిష్యత్తు ఉద్యమాలకు కావాల్సిన కార్యాచరణను ఈ మహాసభలలో తీసుకొనున్నట్ల తెలిపారు. నిరంతరం విద్యారంగా మరియు సామాజిక సమస్యలపై ఉద్యమిస్తూ దేశ సమైక్యత, సమగ్రతల కోసం కృషి చేస్తూ, విద్యారంగం కాషాయీకరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణ విధానాలకు వ్యతిరేకంగా, విద్యారంగంలో ప్రజాతంత్ర, లౌకిక భావాలు వ్యాప్తికై, విద్యా పరిరక్షణకై విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు నిరంతరం విద్యార్థుల మధ్య ఉండి పోరాడేటువంటి సంఘం ఎస్ఎఫ్ఐ అన్నారు. జిల్లాలో విద్యార్థుల సమస్యలపై 15 రోజులు పాటు 1250 కిలోమీటర్లు సైకిల్ యాత్ర, కలెక్టరేట్ ముట్టడిలు, ఐటిడిఏ ముట్టడిలు నిర్వహిస్తూ, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రతి సంవత్సరం పదో తరగతి టాలెంట్ టెస్ట్, మోడల్ ఎంసెట్ వంటి పరీక్షలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు విద్యావేత్తలు,మేధావులు, విద్యార్థి ఉద్యమ పోరాటాలకు సూచనలు, సలహాలు ఉద్యమాల నిర్వహణకు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అనిల్, జానకి రామ్, లక్ష్మీనారాయణ, కార్తీక్, సురేష్, సుమంత్, వివేకానంద తదితరులు పాల్గొన్నారు...