నిజాయతీ చాటుకున్న దిశ రిపోర్టర్ చీర్లవంచ హరీశ్..
జనం న్యూస్07 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్)
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరకు చెందిన 'దిశ' పత్రిక రిపోర్టర్ చీర్లవంచ హరీశ్ నిజాయతీ చాటుకున్నాడు. దామెర నుంచి ఇందిరానగర్ వెళ్లే దారిలో రూ. 10 వేలు విలువ చేసే సెల్ ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తి పోగొట్టుకున్నారు. ఆ సెల్‌ఫోన్ ను గుర్తించిన హరీశ్ ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్ కుమార్ కు సోమవారం అందజేశారు. దొరికిన వస్తువులను ఎవరికీ చెప్పకుండా దాచుకునే ఈ రోజుల్లో.. సెల్‌ఫోన్‌ను పోలీసుస్టేషన్లో అప్పజెప్పి నిజాయతీ చాటుకున్న హరీశ్ ను ఎస్సై అభినందించారు. ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి దామెరకు చెందిన సాతూరి సైదయ్యగా గుర్తించి అతనికి ఎస్సై సెల్‌ఫోన్ అందజేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత గా మెదలాలని ఈ సందర్భంగా ఎస్సై యువతకు సూచించారు.