(జనం న్యూస్) ఏప్రిల్ 7 కల్లూరు మండల రిపోర్టర్ సురేష్:
ఈనెల 19వ తేదీన ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం వాల్ పోస్టర్లను ఏఐసీసీ రాష్ట అధ్యక్షులు రెవరెండ్ ఎనోష్ కుమార్ ఆధ్వర్యంలో డీజిఎం చర్చి ప్రాంగణంలో ఏఐసీసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ద్వారా
క్రైస్తవుల ఐక్యత చాటి చెప్పవలసిన అవశ్యకత ఎంతైనా ఉందని అసోసియేషన్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. ఆదివారం పట్టణములో టిజిఎం వర్షిప్ సెంటర్ నందు రన్ ఫర్ జీసస్ వాల్ పోస్టర్ను రాష్ట్ర అధ్యక్షులు, ప్రేయర్ సెల్ జిల్లా అధ్యక్షులు టి నిర్మల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి దర్నాసి బాలరాజు తో కలసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వ మానవాళి పాపమును పరిహరించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా శుభప్రదమైన నిరీక్షణ మానవాళికి అనుగ్రహించ పడిందని అన్నారు. ఏసుక్రీస్తు వారి బోధలు ప్రేమ, సంతోషం, సమాధానం కలగజేసే విధంగా ఉన్నాయని అన్నారు. మనుషులందరూ ఆ బోధలు అనుసరించుట ద్వారా సంఘంలో, సమాజంలో ప్రేమ, సంతోషము, సమాధానం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సమాజంలో మనుషులందరూ పరమత సహనం కలిగి ఉండాలని కోరారు. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వము వెల్లివెరిసే విధంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని కోరారు. మండలంలో ఉన్న క్రైస్తవ ప్రజలు, సంఘ నాయకులు, మత పెద్దలు, బోధకులు అందరు ఈనెల 19న జరిగే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలలో క్రైస్తవ సమాజానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమములో దాసరి డేవిడ్ రాజు, టి.సంజీవరావు,జాన్ పరం జ్యోతి,దయాకర్,మహేష్,తిమొతి,సుందర్ రాజు, జీవన్ కుమార్,రాజశేఖర్, ఎసోబు పలువురు పాల్గొన్నారు.