జనం న్యూస్ జనవరి 15 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పరిధిలోఈ రోజుఐదో వార్డులోని గంగపుత్ర కాలనీలోమూడు రోజుల క్రితం మోటర్ కాలిపోయి ప్రజలకు నీటి సమస్య వచ్చి చాలా ఇబ్బందికి గురవుతున్న విషయాన్ని ఐదవ వార్డ్కౌన్సిలర్ పరిమి లత సురేష్ దృష్టికి తీసుకు రాగానే వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి కాలిపోయిన మోటర్ స్థానంలో నూతన మోటర్ తెప్పించి ప్రజలకు యధావిధిగా మంచినీటిని అందించడం జరిగినది చెప్పగానే స్పందించి పండుగ ఉన్న గాని ప్రజలకు నీరు లేక ఇబ్బంది ఉండకూడదు అని తక్షణం నూతన మోటర్ తెప్పించి ప్రజలకు మంచినీటిని అందించినందుకు కాలనీవాసులుకౌన్సిలర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.