జనం న్యూస్ ఏప్రిల్ 7 నడిగూడెం
మాల మహానాడు నాయకులంతా ఐక్యతగా ఉండి హక్కులకై ఉద్యమించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి కోరారు. సోమవారం మండల కేంద్రంలో మాల మహానాడు మండల కార్యాలయంను మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మతో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాల మహానాడు మండల నూతన కమిటీకి ఎన్నికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. అధ్యక్షులుగా కొమ్ము రమేష్, ఉపాధ్యక్షులుగా కామల్ల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా బూరుగడ్డ థామస్, కోశాధికారిగా కొమ్ము కిరణ్, సహాయ కార్యదర్శిగా కాలతిరిపి గురుస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా దాసరి నరేష్, గౌరవ సలహాదారులుగా పసుపులేటి మల్లికార్జున్, మండల మహిళా అధ్యక్షురాలుగా నోసిన లావణ్య, కార్యవర్గ సభ్యులుగా దారా జేసుబాబు,నోసిన కోటయ్య, పప్పుల విజయ్, చింతమల్ల సైదులు, పప్పుల నర్సయ్య, రెడ్డిమళ్ల రాంబాబు, వాసా సందీప్,వినోద్, వీరబాబు తదితరులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు నియోజకవర్గ కన్వీనర్ గా ఎన్నికైన గుజ్జ ఆంజనేయులు, నూతన అధ్యక్షుడు కొమ్ము రమేష్ లను గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమం ప్రారంభంనికి ముందు గ్రామంలో ప్రధాన రహదారిపై మాల మహానాడు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జిల్లా, మండల, గ్రామాల మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.