జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్..
ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న 1996 బ్యాచ్‌కు చెందిన కనుకుంట్ల లక్ష్మణ్ హెడ్ కానిస్టేబుల్ పదోన్నతిని పొంది, మెదక్ జిల్లాకు బదిలీ అయ్యాడు. ఈ సందర్భంగా గత మూడు సంవత్సరాలుగా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో అందించిన సేవలకు గుర్తింపుగా స్టేషన్‌లోని SI రాజకుమార్ మరియు ఇతర పోలీసు సిబ్బంది అతడిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సహోద్యోగులు, పోలీస్ సిబ్బంది పాల్గొని లక్ష్మణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. డ్యూటీ పట్ల నిబద్ధత, ప్రజలతో మర్యాదపూరితంగా వ్యవహరించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవాడని సిబ్బంది పేర్కొన్నారు.