జనం న్యూస్. ఏప్రిల్ 7. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్)
నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని. విష్ణు వైపర్ ఫార్మసీ కళాశాలలో వార్షికోత్సవ అన్యువల్ డే ఫంక్షన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ వైస్ హలో ప్రెసిడెంట్ మెడికల్ డైరెక్టర్ మెట్రో గ్రూప్ డాక్టర్. శుభదీప్. నొహ తెరాఫెటిక్స్ ప్రవేట్ లిమిటెడ్.నారా ఉపేంద్ర చౌదరి. విష్ణు విద్యాసంస్థల వైస్ చైర్మన్. రవిచంద్రన్ రాజగోపాల్. సెక్రటరీ ఆదిత్య విస్సామ్. పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శుభదీప్ మాట్లాడుతూ విద్యార్థులు ఏదో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని చదవాలని ఎన్ని ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించి లక్ష్యాన్ని సాధించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా మిగతా రంగాలలో పోల్చుకుంటే ఫార్మాసి రంగం చాలా తొందరగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యంగా ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ముందు వరుసలో ఉందని తెలిపారు. ఫార్మసీ విద్యార్థులు ఈ రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు. నారా ఉపేంద్ర చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు ప్రయోగాలు చేస్తూ ఉండాలని వాటిపై కూడా దృష్టి సాధించి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తుండాలని ఆయన విద్యార్థులకు సూచించారు. విష్ణు విద్యా సంస్థల వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మంచి వాతావరణంతొ కూడిన తమ కళాశాలలు ఉన్నాయని మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని అంతేగాక ఆధునిక వసతులతో కూడిన ప్రయోగశాలలు ఉన్నాయని వాటన్నిటిని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు. అన్యువల్ డే వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాలతో అలరించారు. విష్ణు వైపర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. రమేష్ మాట్లాడుతూ. పెద్దలు సూచించిన విషయాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని విద్యార్థులకు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధులకు కృతజ్ఞతలు తెలిపారు.పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఉత్తమ విద్యార్థులకు విచ్చేసిన అతిధులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో. వైపర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. రమేష్. కన్వీనర్. డాక్టర్ లక్ష్మణ్. వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.