జనం న్యూస్ ఏప్రిల్ 08 సంగారెడ్డి
జిల్లా పటాన్చెరు పట్టణం లో గోకుల్ నగర్ కాలనీ లో అక్రమంగా గంజాయి అమ్ముతున్న వ్యక్తిని మెదక్ ప్రొబిషన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం మేరకు శ్రీ కె శ్రీనివాసరావు అసిస్టెంట్ సూపరిండెంట్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ ఆధ్వర్యంలో మంగళవారం పటాన్ చేరులోని గోకుల్ నగర్ కాలనీ లో దాడులు నిర్వహించగా పట్టుబడినా వ్యక్తి నుండి756 గ్రాముల గంజాయిని ఒక మొబైల్ ఫోను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.పట్టుబడిన వ్యక్తి లాలన సహాని వయస్సు 45 బీహార్ రాష్ట్రానికి వాసిగా ప్రస్తుతం అతను మేస్త్రి గా పనిచేస్తూ. బీహార్ లో గంజాయి కొని ఇక్కడ అధిక ధరకు అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ తనిఖీలలో గాంధీ నాయక్ సి ఐ యాదయ్యఎస్ ఐ MD. అలీమ్, హెడ్ కానిస్టేబుల్ సతీస్ మోహన్ ,కరీమా కానిస్టేబుల్ ప్రహ్లాద రెడ్డి పాల్గొన్నారు.