జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రతిభ అవార్డుకు ఎంపికయ్యారు. సదరన్ ప్రైవేట్ ఉపాధ్యాయ,అధ్యాపక సంస్థ ఆధ్వర్యంలో జాతీయ ప్రతిభ అవార్డు ప్రధానం చేయనున్నారు. అవార్డు కార్యక్రమం ఈనెల 13న ఆదివారం గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బహుమతి ప్రధానోత్సవం జరగనుంది. దక్షిణ భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుండి, ఉపాధ్యాయులు-అధ్యాపకులు అవార్డు సన్మానం అందుకోనున్నారు. గత 15 సంవత్సరాలు పైబడి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న జాఫర్ ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, పలు కార్యక్రమాలు చేపట్టారు. విద్యా, సామాజిక సేవా రంగాల్లో కృషి చేశారు. కవితా తరంగణి పుస్తకాన్ని రచించారు. సబ్జెక్ట్ కాలమిస్టుగా రాణించారు. డాక్టర్ ఏ.పీ.జే అబ్దుల్ కలాం కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ పేరుతో కోచింగ్ సెంటర్ నిర్వహించి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేశారు. జాఫర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రతిభ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పలువురు ప్రైవేటు ఉపాధ్యాయులు-అధ్యాపకులు అభినందనలు తెలిపారు.