గ్రామపంచాయతీ కార్మికుల గోసలు పట్టించుకోరా..
ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే ఇంకా ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని..
జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ యూనియన్ సిఐటి అనుబంధం జమ్మికుంట మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఎంపీడీవో భీమ్ సేనా, కి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఇ సందర్బంగా
కార్మికులు మాట్లాడుతూ.. పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి, అని వేతనాలకు బడ్జెట్ కేటాయించాలని, గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలని పంచాయతీ సిబ్బందిని రెండవ పిఆర్సి లోనికి తీసుకోవాలని అన్నారు. జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కేటాగిరిల వారిగా నియమించాలని, పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు. రిటైర్డ్ బెనిఫిట్ (ఐదు లక్షలు) ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసారు. అలాగే రాష్ట్ర నాయకత్వం పలుమార్లు పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన, పంచాయతీరాజ్ మంత్రి మా సమస్యలపై దృష్టి పెట్టడం లేదు, అన్నారు. పలుమార్లు ముఖ్యమంత్రి ని కూడా కలవడం జరిగింది, అని అయినా కూడా మా సమస్యల పట్ల చొరవ చూపడం లేదు, అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్మికులు ఈనెల 19 తర్వాత ఏ క్షణమైన సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని కార్మికులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండిగ రవీందర్రావు, ప్రధాన కార్యదర్శి లడ్డూనూరి కుమార్, కోశాధికారి మ్యకల్లమల రాము, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసాల సారయ్య, తిరుపతి, రాజ, కొమురయ్య, మొగిలి, సంపత్, సదానందం, రమేష్, రవి, స్వామి, ఆదిరెడ్డి, భద్రయ్య, తో పాటు 30 మంది గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.