జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
ఏఐసీసీ మరియు డీపీసీసీ అధ్యక్షుల పిలుపుమేరకు నేడు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ ఆదేశానుసారం జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో, జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు మాజీ కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య తో కలిసి.రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగింది.ఇ సందర్బంగా పొనగంటి మల్లయ్య మాట్లాడుతూ..అహింసా మార్గంలో పోరాటం చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి, స్వాతంత్రం సిద్ధింప చేసిన మహాత్మా గాంధీతో, పాటు ప్రజల స్వేచ్ఛ సమానత్వం కోసం రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ను బిజెపి, ఆర్ఎస్ఎస్ అవమానపరుస్తూ ఉన్నాయని అన్నారు. మండిపడ్డ పార్లమెంట్ సాక్షిగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ కు,వ్యతిరేకంగా చేసిన వాక్యాలే ఇందుకు నిదర్శనం అని అన్నారు. మహనీయులు ఆశయాలను కాపాడడంతోపాటు ప్రజలకు స్వేచ్ఛ ను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ ఆగ్రనేత లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ ర్యాలీ నిర్వహిస్తున్నాం అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడడానికి ప్రజల హక్కులను పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో గ్రామాలలో సామాజిక న్యాయం ఐక్యత కల్పించే, ప్రధాన ఉద్దేశం తో రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్రీయ పాదయాత్రను చేస్తున్నామని అన్నారు. రాజ్యాంగ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు మహనీయులను స్మరించుకుంటూ వారు చేసిన సేవలను నేటి తరానికి తెలియపరిచే ఉద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, కమిటీ డైరెక్టర్ సూర్య, లతోపాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మలుగూరి సదయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గూడెం సారంగపాణి, మాజీ కౌన్సిలర్లు పొనగంటి రాము, రావికంటి రాజు, దేశిని సదానందం, పొనగంటి సారంగపాణి, శ్రీహరి, మోహన్, యువజన నాయకులు సాయిని రవి, పంజాల అజయ్ గౌడ్, మైసమ్మేందర్ వార్డ్ కమిటీ అధ్యక్షులు ముద్దమల్ల రవి, గుల్లి జఫ్ఫానియా, దొడ్డే నవీన్, శ్యామ్ చిన్నింటి నాగేంద్ర, పొనగంటి విష్ణు, బోళ్ల కుమార్, 23వ వార్డు ప్రజలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.