రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
కొనుగోలు కేంద్రాల వద్ద సంబంధిత అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి
రైతులందరూ నాణ్యత ప్రమాణాలు పాటించి మద్దతు ధర పొందాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్
జనం న్యూస్ ఏప్రిల్ 09(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కోదాడ, మునగాల మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా నల్లబండగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సన్న బియ్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు. అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని తెలిపారు.అనంతరం మునగాల మండల పరిధిలోని బరాకత్ గూడెం గ్రామంలో గల పిఎసిఎస్ వారు ఏర్పాటు చేసిన సన్నధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు.కొనుగోలు కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు.ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.రోజువారీగా ఎంత ధాన్యం సేకరిస్తున్నారో తప్పకుండా రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు.కొలత యంత్రాలు,గని బ్యాగులు, ప్యాడి క్లీనర్స్ లను పరిశీలించారు.జాప్యం లేకుండా కొనుగోలును వేగంగా చేపట్టాలని కేంద్ర నిర్వాహలకు సూచించారు. కోదాడ డివిజన్లో 68 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు.జిల్లాలో ప్రస్తుత సీజన్లో ఇప్పటికి 286 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. దొడ్డు రకం కొనుగోలు కేంద్రాలు 212 సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు 74 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఐకెపి ద్వారా 137 పిఎసిఎస్ వారి ద్వారా 127 మెప్మా 12 ఎఫ్ పి ఓ 10 మొత్తం 286 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సంబంధిత అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరిగిన అత్యధికారులపై చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. టైప్ చేసిన మిల్లుల వారిగా ధాన్యాన్ని దిగుమతి చేయాలని రైస్ మిల్లర్లు ధాన్యాన్ని వెంట వెంటనే అన్లోడ్ చేసుకునే విధంగా క్షేత్రస్థాయిలో పూరసరఫరాల అధికారులు పరిశీలించాలని తెలిపారు కొనుగోలు కేంద్రాలలో సరిపడా టపాల నీళ్లు గని బ్యాగులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి ,సొసైటీ అధ్యక్షులు కొత్త రఘుపతి ,కందిబండ సత్యనారాయణ ,ఆర్డిఓ సూర్యనారాయణ, తాసిల్దార్లు వి. ఆంజనేయులు, ఆజిద్ అలి,ఎంఏఓ రాజు, ఏఈఓ రేష్మ, సీఈఓ కృష్ణ, బసవయ్య,అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.